News September 10, 2024
హనీ ట్రాప్ జరిగింది.. నాపై కేసు కొట్టేయండి: ఎమ్మెల్యే పిటిషన్

AP: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు <<14034033>>కొట్టేయాలని<<>> సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై, ఆగస్టులో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా మహిళ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. దీన్ని హనీట్రాప్‌గా పేర్కొన్నారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని టీడీపీకి చెందిన ఓ మహిళ <<14026695>>వీడియోలు<<>> రిలీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 12, 2025
టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి?

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
News November 12, 2025
విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
News November 12, 2025
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


