News March 21, 2025
కర్ణాటకలో మంత్రులు సహా 48మంది నేతలపై ‘హనీ ట్రాప్’!

కర్ణాటకలో మంత్రులు సహా 48మంది ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం విసిరిన వలపు వలల్లో జాతీయ స్థాయి నేతలు సైతం చిక్కుకున్నారని అసెంబ్లీలో మంత్రి కేఎన్ రాజన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయించాలని అటు అధికార, ఇటు విపక్ష నేతలు డిమాండ్ చేయడంతో దర్యాప్తు చేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Similar News
News March 21, 2025
తాడిపత్రిలో ఉద్రిక్తత

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
News March 21, 2025
BRS వల్ల ఒక జనరేషన్ నాశనం: భట్టి

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.
News March 21, 2025
SHOCKING: మాంసం, హలీం తింటున్నారా?

TG: HYDలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటీవల మంగళ్‌హట్‌లో అధికారులు 12 టన్నుల మేక మాంసాన్ని సీజ్ చేయగా, ఇవాళ డబీర్‌పురలో 2 టన్నుల మటన్‌ను గుర్తించారు. పాడైన మేక, గొర్రె మాంసాన్ని వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు మిస్సాహుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మటన్, హలీం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు.