News September 21, 2024

రాష్ట్రంలో పరువు హత్య

image

AP: అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురిని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు(D) పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య, దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి(24) భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బానీ బాషాను పెళ్లిచేసుకోగా తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటిపక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

Similar News

News September 21, 2024

ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.

News September 21, 2024

వెయ్యి రన్స్ కొట్టిన ఓల్డెస్ట్ కెప్టెన్‌గా రోహిత్

image

కెప్టెన్ రోహిత్‌శర్మ బంగ్లాదేశ్‌తో టెస్టులో(5, 6రన్స్) రాణించలేకపోయినా ఒక రికార్డు నమోదు చేశారు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికిపైగా రన్స్ చేసిన ఓల్డెస్ట్ భారత కెప్టెన్‌‌గా నిలిచారు. 37Y రోహిత్ 2024లో 3 వన్డేలు(157), 11 T20లు(378), 7 టెస్టుల్లో(466) మొత్తం 1,001 రన్స్ చేశారు. ఈ ఏడాది టాప్ స్కోరర్లుగా శ్రీలంక క్రికెటర్లు నిస్సాంక, కుశాల్ మెండిస్, 3లో జైస్వాల్, 4లో కమిందు మెండిస్, 5లో రోహిత్ ఉన్నారు.

News September 21, 2024

ట్రంప్‌పై హత్యాయత్నం: తప్పంతా సీక్రెట్ సర్వీస్‌దే!

image

పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు భద్రతా వైఫల్యానికి US సీక్రెట్ సర్వీస్‌దే బాధ్యతని కొత్త రిపోర్టు వచ్చింది. టెక్నాలజీని వాడటంలో ఏజెంట్లు నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు తెలిపింది. లేదంటే ర్యాలీకి కొన్ని గంటల ముందే డ్రోన్ ఎగరేసిన అటాకర్‌ను గుర్తించేవాళ్లని పేర్కొంది. వైఫల్యానికి తోడు సీక్రెట్ సర్వీస్ అడ్వాన్స్ టీమ్‌, స్థానిక పోలీసుల మధ్య సమన్వయమే లేదని ఎత్తిచూపింది.