News August 11, 2024
పరువు హత్య హింస కాదు.. అది ప్రేమ: నటుడి సంచలన వ్యాఖ్యలు
పరువు హత్యలపై తమిళ నటుడు, దర్శకుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరువు హత్య హింస కానే కాదు.. అది వారి పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమ. మన బైక్ను ఎంతో శ్రద్ధగా చూసుకుంటాం. దానికి ఏమైనా అయితే తట్టుకోలేం. అలాంటిది పిల్లల జీవితంపై ఎంత శ్రద్ధ పెడతాం. పిల్లలు దారి తప్పినప్పుడు తల్లిదండ్రులు కోపం చూపిస్తారు. అది హింస కాదు, పిల్లలపై ఉన్న శ్రద్ధ’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 19, 2025
‘కన్నప్ప’ స్టోరీ ఐడియా ఆయనదే: మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా గురించి ఏడెనిమిదేళ్లుగా ప్లానింగ్లో ఉన్నట్లు హీరో మంచు విష్ణు చెప్పారు. బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
News January 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో నా ఫేవరెట్ టీమ్ పాక్: గవాస్కర్
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫేవరెట్ టీమ్ పాకిస్తాన్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. స్వదేశంలో పాక్ను ఓడించడం అంత సులువు కాదని తెలిపారు. స్వదేశంలో ఆడటం ఆ జట్టుకు కలిసొస్తుందన్నారు. గత వరల్డ్కప్ ఫైనల్లో అతిథ్య భారత జట్టు ఓడినా టోర్నీ మొత్తం అదిరిపోయే ప్రదర్శన చేసిందని గుర్తు చేశారు. CTకి పాకిస్తాన్, యూఏఈ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
News January 19, 2025
నేటి నుంచి కొమురవెల్లి జాతర
TG: నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర మొదలవనుంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. ఇవాళ తొలి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు.