News December 2, 2024

పరువు హత్య.. మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు!

image

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు.

Similar News

News November 27, 2025

డిసెంబర్‌లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

image

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్‌లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.

News November 27, 2025

తీవ్ర అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని APSDMA వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంట గంటకు 50-70KM వేగంతో గాలులు వీస్తాయంది.

News November 27, 2025

నేడే మెగా వేలం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మెగా ఆక్షన్ నేడు ఢిల్లీలో జరగనుంది. 277 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన దీప్తీ శర్మ, రేణుక, వోల్వార్ట్ తదితరులు భారీ ధర దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయస్సుగల వారు కాగా, SA ప్లేయర్ షబ్నిమ్(37)ఓల్డెస్ట్ క్రికెటర్.