News April 12, 2025

మార్క్ శంకర్‌ను రక్షించిన సిబ్బందికి సన్మానం

image

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్‌ను కాపాడిన రెస్క్యూ సిబ్బందికి ఆ దేశ ప్రభుత్వం సన్మానం చేసింది. స్కూల్ భవనంలో జరిగిన ప్రమాదంలో 22 మందిని సిబ్బంది రక్షించారు. ప్రాణాలను పణంగా పెట్టి, చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులను కాపాడినందుకు సత్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా చికిత్స అనంతరం మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 19, 2025

విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

image

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.

News November 19, 2025

పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.