News April 7, 2024
మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా: కిషన్ రెడ్డి

TG: గత బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. మోదీ నాయకత్వంలో తాము సమర్థవంతంగా పనిచేశామని చెప్పారు. కరోనా సమయంలోనూ మోదీనే పేదలను ఆదుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌ను మూడో స్థానానికి తీసుకెళ్తామన్నారు.
Similar News
News January 22, 2026
ఎండిన వారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News January 22, 2026
కొద్దిమంది చేతుల్లోకే సంపద.. బిల్ గేట్స్ హెచ్చరిక

AI కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడతాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ‘ఐదేళ్లలో వైట్, బ్లూ కాలర్ జాబ్స్ని AI ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాలు కొత్త స్కిల్స్ నేర్పించడం/టాక్స్ స్లాబ్స్‌లో మార్పులు చేయాలి. AI ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కాల్ సెంటర్స్‌లో లోయర్ స్కిల్ జాబ్స్ భర్తీ చేసింది. ఇలాగే సాగితే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకే వెళ్లిపోతాయి’ అని హెచ్చరించారు.
News January 22, 2026
ఘోర ప్రమాదం.. బస్సు, లారీ దగ్ధం

AP: నంద్యాల(D) సిరివెల్లమెట్ట వద్ద ప్రైవేటు బస్సుకు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి HYD వెళ్తున్న ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ చనిపోయారు. వెంటనే మంటలు అంటుకోగా ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు, లారీ పూర్తిగా కాలిపోయాయి. క్షతగాత్రులను నంద్యాల ఆస్పత్రికి తరలించారు.


