News November 3, 2024
HOPE: 11 దేశాలపై శతకాలు బాదేశాడు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షయ్ హోప్ (117) శతకంతో మెరిశారు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన హోప్ ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 127 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 పరుగులు బాదారు. ఇప్పటివరకు ఆయన 11 దేశాలపై సెంచరీలు చేశారు. కార్టీ (71), రూథర్‌ఫర్డ్ (54) కూడా రాణించడంతో ఓవర్లన్నీ ఆడి విండీస్ 328/6 రన్స్ సాధించింది.
Similar News
News November 4, 2024
DANGER: డైలీ ఎంత ఉప్పు తింటున్నారు?
ఉప్పుతో ఆహారానికి రుచి. అందుకే చాలామంది తినాల్సిన దానికంటే అధికంగా ఉప్పు తింటున్నారు. అయితే ఉప్పు ఎక్కువ లేక తక్కువ తిన్నా ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా దాదాపు 20లక్షల మరణాలకు ఉప్పు కారణమవుతోందంటున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5గ్రా.లు లేదా టీస్పూన్ ఉప్పు వాడాలని WHO చెబుతోంది. కానీ చాలామంది 11గ్రాములు తీసుకుంటున్నారు. అందుకే కొన్ని దేశాలు ఉప్పు వాడకం తగ్గించడంపై ఫోకస్ పెట్టాయి.
News November 4, 2024
పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి
TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 4, 2024
రేపు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పల్నాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములు పరిశీలించనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. సరస్వతి శక్తికి సంబంధించిన భూ ఉల్లంఘనలను తనిఖీ చేస్తానని పవన్ కళ్యాణ్ సైతం వెల్లడించారు. కాగా సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.