News June 21, 2024
అలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగవని ఆశిస్తున్నా: KTR
TG: తమిళనాడులో కల్తీ సారా తాగి 38మంది మరణించిన ఘటనపై మాజీ మంత్రి KTR స్పందించారు. రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరగవని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టదని భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు కల్తీ సారా ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు.
Similar News
News January 15, 2025
ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.
News January 15, 2025
హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!
తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్‌నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్‌లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్‌తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.
News January 15, 2025
Stock Markets: మెటల్, PSU బ్యాంకు షేర్లకు గిరాకీ
మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,202 (+25), సెన్సెక్స్ 76,649 (+150) వద్ద ట్రేడవుతున్నాయి. సెక్టోరల్ ఇండైసెస్ మిశ్రమంగా ఉన్నాయి. మెటల్, PSU BANK, ఆటో, O&G షేర్లకు డిమాండ్ ఉంది. FMCG, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. NTPC, మారుతీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ADANI SEZ టాప్ గెయినర్స్. BAJAJ TWINS టాప్ లూజర్స్.