News March 3, 2025
ఘోరం.. సినిమా చూసి చిన్నారిని చంపేసిన బాలుడు

క్రైమ్ సినిమాలు సమాజంలో ఎలాంటి దుష్పరిణామాలు కలిగిస్తాయో చెప్పే ఉదాహరణ ఇది. ‘రామన్ రాఘవ్’ అనే సీరియల్ కిల్లర్ మూవీ చూసి 13ఏళ్ల బాలుడు తన బంధువైన ఆరేళ్ల బాలికను చంపేశాడు. గొంతుకోసి బండరాయితో ముఖాన్ని ఛిద్రం చేశాడు. చిన్నారిని కుటుంబసభ్యులు ముద్దు చేస్తుండటాన్ని తట్టుకోలేక అసూయతో దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలో ఈ ఘటన జరగగా, సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 13, 2025
వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.
News November 13, 2025
షమీని ఎందుకు తీసుకోవట్లేదు? గిల్ సమాధానమిదే

షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్‌లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్‌గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్‌రౌండర్ లేదా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 13, 2025
రాష్ట్రంలో 107 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఏపీ మెడికల్ &హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, M.COM, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWSలకు రూ.750. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/


