News March 27, 2025
ఘోరం.. నలుగురు పిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య

యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి భార్య కంతీదేవితో గొడవపడి, కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషభ్) గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ భార్య చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలంతా 13 నుంచి 5 ఏళ్ల లోపు వారే. రాజీవ్ మెంటల్ హెల్త్ సరిగా లేదని పోలీసులు తెలిపారు.
Similar News
News March 30, 2025
మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

ఇప్పటికే ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా 50మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14మంది తలలపై రూ.68లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. PM మరికొన్ని గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనుండగా ఈ లొంగుబాటు జరగడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో 25మంది నక్సలైట్లు లొంగిపోయారు.
News March 30, 2025
‘విశ్వావసు’లో మంచి ముహూర్తాలు ఇవే..

* ఏప్రిల్: 6, 16, 18, 20, 23, 30
* మే: 1, 8, 9, 11, 17, 18, 28
* జూన్: 1, 2, 5, 6, 7, 8 * జులై: 16, 30
* ఆగస్టు: 1, 4, 7, 8, 9, 10, 13, 14, 17
* సెప్టెంబర్: 26, 27
* అక్టోబర్: 1, 2, 3, 4, 6, 8, 10, 11, 22, 24
* ఫిబ్రవరి(2026): 19, 20, 21, 22, 25, 26, 27
* మార్చి: 4, 5, 7, 8, 11
* జూన్ 26- జులై 24, ఆగస్టు 24-సెప్టెంబర్ 21, నవంబర్ 21- ఫిబ్రవరి 18(2026), మార్చి12-19(2026) మధ్య ముహూర్తాలు లేవు.
News March 30, 2025
నారా లోకేశ్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం: సోమిరెడ్డి చంద్రమోహన్

AP: పార్టీలో రెండు టర్మ్‌లు ఓ పదవిలో పనిచేసినవారు పై స్థాయికి వెళ్లాలి లేదా టర్మ్ గ్యాప్ తీసుకోవాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు TDP సీనియర్లు మద్దతు పలికారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్కొన్నారు. ‘లోకేశ్ ప్రతిపాదనకు మద్దతునిస్తున్నాం. 2012 నుంచి నేను టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నాను. నా స్థానంలో వేరొకరికి అవకాశమివ్వాలనుకుంటే నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.