News January 31, 2025
ఘోరం.. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లినే చంపేశాడు

AP: విశాఖ మల్కాపురంలో దారుణ ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన బీటెక్ చదువుతున్న యువకుడు తల్లినే హతమార్చాడు. చదువుపై దృష్టిసారించాలని, గేమ్స్ ఆడొద్దని తల్లి అల్కాసింగ్ చెప్పడమే అతని కోపానికి కారణమైంది. రాడ్డుతో ఇష్టారీతిన కొట్టడంతో ఆమె చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్కాసింగ్ భర్త నేవీ అధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవలే ముంబై నుంచి విశాఖకు బదిలీ అయ్యారు.
Similar News
News January 27, 2026
పహల్గాం హీరో అదిల్‌కు అవార్డు

గత ఏప్రిల్‌లో ఉగ్రమూకలు పహల్గాంలో జరిపిన దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన అదిల్ హుస్సేన్ షాకు JK ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కునేందుకు అదిల్ యత్నించారు. హార్స్ రైడర్ అయిన ఆయన ప్రాణాలను పణంగా పెట్టి టూరిస్టులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం ₹లక్ష నగదుతో పాటు అవార్డును వారి ఫ్యామిలీకి అందజేసింది.
News January 26, 2026
నేషనల్ అవార్డ్ విన్నర్‌తో మోహన్‌లాల్ కొత్త సినిమా

రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ లాల్ తన 367వ సినిమాను ప్రకటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీ గోకులం మూవీస్’ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ‘దృశ్యం 3’తో రాబోతున్న మోహన్ లాల్.. మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ గంగా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని సమాచారం.
News January 26, 2026
మంత్రులు భేటీ అయితే తప్పేముంది: మహేశ్

TG: నలుగురు మంత్రులు అత్యవసరంగా <<18968187>>సమావేశమయ్యారనే<<>> వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు పరిపాలనా అంశంలో మంత్రులు భేటీ అయితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయంగానే సమావేశం నిర్వహించినట్లు భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు.


