News June 23, 2024

ఘోరం.. కన్నబిడ్డను ఎత్తి బావిలో పడేశాడు

image

అనుమానం పెనుభూతమై కన్నతండ్రిని కర్కశుణ్ని చేసింది. అనంతపురం(D) నార్పలకు చెందిన గణేశ్.. భార్యకు వివాహేతర సంబంధముందని, కూతురు పావని(6) తనకు పుట్టలేదని అనుమానించేవాడు. జూన్ 20న పావనిని స్కూల్ నుంచి బయటకు తెచ్చి పాడుబడ్డ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈత నేర్పిస్తాంటూ దూకమన్నాడు. ఆ పాప భయమేస్తోందంటూ గుక్కపట్టి ఏడ్చింది. కనికరం చూపని గణేశ్ పాపను ఎత్తి బావిలో పడేశాడు. పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించాడు.

Similar News

News January 9, 2025

వెంటిలేటర్‌పై ఎవరూ లేరు: సత్యకుమార్

image

AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్‌పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇంకా 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

News January 9, 2025

మావోయిస్టులపై మరోసారి పోలీస్ పంజా

image

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

News January 9, 2025

సోషల్ మీడియాలో మరో హీరోయిన్‌కు వేధింపులు

image

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని హీరోయిన్ నిధి అగర్వాల్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అంతమొందిస్తానని అతడు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యా బెదిరింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె వాపోయారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్‌ను కూడా ఓ వ్యాపారవేత్త వేధించిన విషయం తెలిసిందే.