News September 8, 2024
ఘోరం.. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు చిన్నారిని అమ్మేశాడు

యూపీలో ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు ఓ తండ్రి మూడేళ్ల చిన్నారిని అమ్మేశాడు. భార్య ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి బిల్లు కడితేనే పంపుతామని యాజమాన్యం తేల్చిచెప్పడంతో తన మూడేళ్ల కొడుకును అమ్మకానికి పెట్టాడు. ఇది కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
Similar News
News December 6, 2025
దాట్ల జీపీలో 20 ఏళ్లుగా భార్యాభర్తలే సర్పంచ్!

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో 20 ఏళ్లుగా కొమ్మినేని రవీందర్-మంజుల దంపతుల కుటుంబమే సర్పంచ్ పదవిలో కొనసాగుతోంది. 2001లో రవీందర్ తొలిసారి గెలుపొందగా, ఆ తర్వాత ఆయన వరుసగా రెండు సార్లు, 2013లో మంజుల, 2019లో రవీందర్ గెలిచారు. ఇప్పుడు మళ్లీ మంజుల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
News December 6, 2025
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం కఠిన చర్యలు

ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.
News December 6, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

AP: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 13 వరకు 9AM నుంచి 12PM వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి 28 వరకు 9.30AM నుంచి 12.30PM వరకు జరుగుతాయి.
వెబ్సైట్: https://apopenschool.ap.gov.in/


