News January 31, 2025
ఘోరం: కన్నతండ్రిని కాల్వలోకి విసిరేశాడు!

కొడుకు పుట్టాడని పొంగిపోయి, కళ్లలో పెట్టుకుని పెంచుకొచ్చాడా తండ్రి. కానీ వయసైపోయాక ఆ తండ్రి దుర్మార్గపు కొడుక్కి భారమయ్యాడు. భార్య విసుక్కుంటోందని, నడవలేని ఆ తండ్రిని తీసుకెళ్లి కాల్వలో పడేసి హతమార్చాడు. పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలంలో ఈ ఘోరం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం మృతుడిని గంగినేని కొండయ్య(85)గా, సదరు కొడుకుని వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.
Similar News
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>