News May 14, 2024
ఘోరం.. చిన్నారిని పీక్కు తిన్న పెంపుడు కుక్క
TG: వికారాబాద్(D) తాండూరులో ఘోరం జరిగింది. 5 నెలల చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. MBNR జిల్లాకు చెందిన దత్తు, లావణ్య బసవేశ్వరనగర్‌లోని నాగభూషణంకు చెందిన పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. దంపతులు వస్తువులు కొనడానికి వెళ్లగా.. నాగభూషణం పెంపుడు కుక్క ఇంట్లోని వారి కొడుకుపై దాడి చేసింది. చిన్నారి కనుగుడ్డును, మొహంలోని కొంత భాగాన్ని పీక్కుతిన్నది. దీంతో బాబు ప్రాణాలు కోల్పోయాడు.
Similar News
News January 10, 2025
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. 18న కీలక తీర్పు
సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సంజయ్‌కు మరణశిక్ష విధించాలని CBI కోరింది. అటు కేసులో సాక్ష్యాలను క్రియేట్ చేసి తన క్లయింట్‌ను ఇరికించారని నిందితుడి లాయర్ వాదించారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
News January 10, 2025
మోదీజీ.. ఇగో పక్కనపెట్టి రైతులతో చర్చించండి: ప్రియాంక
ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. రైతుల పట్ల కేంద్రం క్రూరంగా ప్రవర్తిస్తోందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తన ఇగోను పక్కనపెట్టి అన్నదాతలతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మొండి వైఖరే గతంలో 700 మంది రైతులను పొట్టనబెట్టుకుందని ప్రియాంక ఆరోపించారు.
News January 10, 2025
మహా కుంభమేళాలో గాయకుల ప్రదర్శనలు
ఈనెల 13 నుంచి ప్రారంభంకానున్న మహా కుంభమేళాకు UP సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను అలరించేందుకు గాయకులతో పాటలు పాడించనుంది. శంకర్ మహదేవన్, హరిహరణ్, షాన్ ముఖర్జీ, కైలాశ్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, మాలిని అవస్తీ తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న మేళా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని అధికారులను ఆదేశించారు.