News August 23, 2025

ఘోరం: కేక్ తినిపించిన చేతులతోనే..

image

TG: సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ డే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతుల్తో బాలికను అత్యంత దారుణంగా హత్య చేయడం స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. కాగా సహస్ర ఇంట్లో <<17485132>>డబ్బులు దొంగిలించి<<>> క్రికెట్ బ్యాట్ కొనాలనుకున్నట్లు బాలుడు చెప్పినట్లు తెలుస్తోంది. క్రైమ్ వెబ్‌సిరీస్‌లు చూసే హత్య ఆలోచన వచ్చినట్లు చెప్పాడని సమాచారం.

Similar News

News August 23, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: తుమ్మల

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని స్థానిక నేతలకు ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ బూత్ లెవెల్ నేతలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ప్రతీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ఇంటింటికీ వివరించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News August 23, 2025

కేంద్ర మంత్రి కుమారుడిని ముద్దాడిన చంద్రబాబు

image

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులకు జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి బాగోగులు తెలుసుకున్నారు.

News August 23, 2025

ఫైనల్‌కు దూసుకెళ్లిన తుంగభద్ర వారియర్స్

image

APL క్వాలిఫయర్-2లో భీమవరం బుల్స్‌పై తుంగభద్ర వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ వైజాగ్‌లో జరిగే ఫైనల్లో అమరావతి రాయల్స్‌తో తలపడనుంది. తొలుత భీమవరం ఓవర్లన్నీ ఆడి 183/5 పరుగులు చేసింది. తోట శ్రవణ్ (71*) రాణించారు. అనంతరం 19 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి తుంగభద్ర లక్ష్యాన్ని ఛేదించింది. గుట్ట రోహిత్ (87) విధ్వంసం సృష్టించారు.