News April 5, 2025
ఘోరం.. 13ఏళ్ల క్యాన్సర్ పేషంట్పై అత్యాచారం

మహారాష్ట్ర థానేలో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్తో పోరాడుతున్న 13 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ముంబైలోని ఆస్పత్రిలో చిన్నారికి కీమోథెరపీ చేయిస్తుండగా రొటీన్ పరీక్షల్లో ఈ విషయం బయటికొచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబంతోపాటు నిందితుడు బిహార్కు చెందినవారని తెలిపారు. చిన్నారి చికిత్స కోసం ముంబైకి వచ్చినట్లు చెప్పారు.
Similar News
News April 6, 2025
CPM ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన MA బేబీ

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా MA బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులో నిర్వహిస్తున్న పార్టీ మహాసభల్లో నేతలంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశలో కేరళ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరికతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బేబీ 1986 నుంచి 1998 వరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేరళ మంత్రిగానూ సేవలందించారు. సీతారాం ఏచూరి మరణంతో ఇంతకాలం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది.
News April 6, 2025
8న అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్?

పుష్ప-2 తర్వాత రెస్ట్ మోడ్లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఎల్లుండి కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. నిర్మాత బన్నీ వాస్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘APR 8న షాకింగ్ సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొనడంతో ఐకాన్ స్టార్- అట్లీ మూవీ గురించేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ రోజు టెక్నీషియన్లను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
News April 6, 2025
జగన్ను మించి అప్పులు చేస్తున్న కూటమి: రామకృష్ణ

AP అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే ₹62వేల కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే ₹5వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి BJP, TDP, JSP, YCP ముస్లింలను మోసం చేశాయని ఫైరయ్యారు.