News August 20, 2024
CRPF బలగాలతో ఆస్పత్రికి భద్రత

కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్టళ్లలో సాధారణ పరిస్థితులు తేవడానికి CRPF బలగాలతో భద్రత ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వైద్యులు విధులకు హాజరయ్యేలా, విద్యార్థులు చదువులు కొనసాగించడానికి భద్రతాపరమైన భరోసా ఇచ్చేవిధంగా బలగాలు మోహరిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. బెంగాల్ ప్రభుత్వం కూడా అంగీకరించడంతో కోర్టు అనుమతించింది.
Similar News
News November 22, 2025
వందల మందిని కాపాడే ఏఐ పరికరం.. అభినందించాల్సిందే!

హిమాచల్ ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎంతో మంది చనిపోతుంటారు. అలాంటి ప్రమాద మరణాలను తగ్గించేందుకు IIT మండికి చెందిన డా.కళా వెంకట ఉదయ్ టీమ్ అతి తక్కువ ఖర్చుతో AI వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది 90% పైగా కచ్చితత్వంతో 3 గంటల ముందుగానే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. దీని సెన్సార్లు భూమి కదలిక, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి ప్రమాదానికి ముందు అలర్ట్ చేస్తుంది.
News November 22, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్సైట్: cdri.res.in
News November 22, 2025
నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>


