News March 26, 2024
HOSTELలో నెల్లూరు యువకుడి SUICIDE
HYDలో నెల్లూరు జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు(M) పందలపాడుకు చెందిన కిరణ్ కుమార్(26) HYD వనస్థలిపురంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 9, 2025
రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనవద్దు: కలెక్టర్
రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు.
News January 8, 2025
జాతీయ కుష్టు వ్యాధి నివారణ పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆనంద్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నివారణకు మరింత ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News January 8, 2025
ఆ రోజుల్లో రూ.575కే నెల్లూరు నుంచి శ్రీలంకకు టూర్
ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లినా కనీసం రూ.2 వేలు దాటుతోంది. ఓ బ్రాండెడ్ షర్ట్ ధర రూ.800పైనే ఉంటోంది. అయితే రూ.500కు శ్రీలంక వెళ్లొచ్చు అంటే మీరు నమ్మగలరా.. నిజమేనండి. కాకపోతే ఇది 50 ఏళ్లనాటి మాట. 1974లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నెల్లూరు నుంచి రూ.575కే ఏకంగా 15 రోజుల పాటూ శ్రీలంకకు టూర్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఇందుకు సంబందించి ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ కామెంట్ చెప్పండి.