News August 21, 2025
భారత్‌తో విరోధం USకి మంచిది కాదు: నిక్కీ హేలీ

భారత్‌ను శత్రువుగా చూడటం ట్రంప్ విదేశాంగ పాలసీ స్ట్రాటజీల్లోనే బిగ్ డిజాస్టర్ అని US మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘చైనా తరహాలో భారత్‌ని ప్రత్యర్థిగా కాదు.. మిత్ర దేశంలా చూడాలి. అన్ని విధాలుగా ఆసియా ఖండంలో చైనాకు చెక్ పెట్టగల సామర్థ్యం భారత్‌కే ఉంది. కమ్యూనిస్ట్స్ నియంత్రణలో నడిచే చైనాతో పోలిస్తే.. ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఎలాంటి హానీ చేయదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 21, 2025
రేపు ఫలితాలు విడుదల

AP: రేపు DSC మెరిట్ <<17459141>>లిస్ట్ <<>>విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు.
News August 21, 2025
వలపు వల.. వృద్ధుడు విలవిల

TG: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో HYD అమీర్‌పేటకు చెందిన ఓ వృద్ధుడు(81) చిక్కుకున్నాడు. మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరిట అతడికి జూన్ మొదటివారంలో స్కామర్స్ వాట్సాప్ కాల్ చేశారు. చనువుగా మాట్లాడుతూ ట్రాప్ చేసి ఆస్పత్రి ఖర్చులు, ప్లాట్ రిజిస్ట్రేషన్, బంగారు ఆభరణాలు విడిపించడం కోసమంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారా రూ.7.11 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.
News August 21, 2025
APLలో హేమంత్ విధ్వంసం

ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2025లో భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొట్టారు. విజయవాడ సన్‌షైనర్స్‌తో మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 6 సిక్సులు, 3 ఫోర్లు బాది 71* రన్స్ చేశారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి, కేవలం 19 పరుగులే ఇచ్చారు. 161 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భీమవరం బుల్స్.. హేమంత్, హిమకర్(43) చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.