News January 1, 2025

తమ్ముడితో హీట్ ఫైటింగ్.. బ్రదర్స్‌తో కూల్ మీటింగ్

image

ప్రత్యర్థి ఆటగాళ్లతో ఫైటింగ్ గ్రౌండ్ వరకే పరిమితమని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. మెల్‌బోర్న్ టెస్టులో ఆసీస్ ప్లేయర్ శామ్ కోన్ట్సస్‌‌ను కోహ్లీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిశాక అతని సోదరులు బిల్లీ, జానీ రన్ మెషీన్‌ను కలిసి ఫొటో దిగారు. అతనితో సరదాగా మాట్లాడారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లీ గ్రౌండులో ఏం చేసినా జట్టు కోసమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 4, 2025

ఇండియాలో తొలి బీటా బేబీ ఎవరంటే?

image

ఈ ఏడాది నుంచి కొత్త జనరేషన్ ప్రారంభమైంది. దీనిని జనరేషన్ బీటాగా పిలుస్తున్నారు. 2025-2039 మ‌ధ్య జ‌న్మించే పిల్ల‌ల‌ను జ‌న‌రేష‌న్ బీటాగా ప‌రిగ‌ణిస్తారు. మన దేశంలో తొలి బీటా శిశువు మిజోరం రాష్ట్రంలో జన్మించాడు. అతనికి ఫ్రాంకీ రెమ్రువాత్‌డికా జాడెంగ్ అని పేరు పెట్టారు. జనవరి 1న రాత్రి 12.03కు ఆ బాబుకు రామ్జీర్‌మావీ, జెడ్‌డీ రెమ్రువాత్‌సంగా దంపతులు జన్మనిచ్చారు.

News January 4, 2025

ట్రంప్‌నకు శిక్ష.. అనుభవించాల్సిన అవసరం లేదు!

image

హష్ మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ, కానీ అనుభవించాల్సిన అవసరం లేదని న్యూయార్క్ జడ్జి జ్యుయన్ మర్చన్ తన తీర్పులో తెలిపారు. ప్రొబెషన్‌తో పాటు జరిమానా కూడా చెల్లించకుండా ‘అన్‌కండిషనల్ డిశ్చార్జ్’ అమలు చేస్తామన్నారు. శిక్ష విధించే JAN 10న వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరుకావాలని చెప్పారు. ఈ నెల 20న ట్రంప్ US అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

News January 4, 2025

కుంభమేళాకు ఉగ్రముప్పు

image

యూపీలోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రమూకలు సాధువుల రూపంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.