News February 9, 2025
వేడి వాతావరణం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు తెలిపింది. నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది.
Similar News
News January 17, 2026
నేడు ముక్కనుమే అయినా నాన్-వెజ్ ఎందుకు తినకూడదు?

ముక్కనుమ నాడు మాంసాహారం తినొచ్చు. కానీ, నేడు మాస శివరాత్రి, శనివారం వచ్చాయి. శివరాత్రి శివునికి ప్రీతికరమైనది. అందుకే సాత్వికాహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే శనివారం శనిదేవుని, శ్రీనివాసుడి, హనుమాన్ ఆరాధనకు ఉద్దేశించిన రోజు. నియమ నిష్టలు పాటించాలి. ఇలాంటి పవిత్ర తిథి, వారాలు కలిసినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత, దైవ అనుగ్రహం లభిస్తాయి. అందుకే నేడు శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.
News January 17, 2026
ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

TG: మేడారం జాతర కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో బుకింగ్కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.
News January 17, 2026
ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి గుర్తించుకోండి

ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అవసరమే అయినా, సరైన అవగాహన లేకుంటే నష్టమే వస్తుంది. పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీల ఆఫర్లను కంపేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ నిబంధనలను పూర్తిగా చదవాలని, క్లెయిమ్ ప్రక్రియ వేగంగా జరిగే కంపెనీలను ఎంచుకోవాలని అంటున్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి రైడర్లను తీసుకుంటే మరింత బాగుంటుంది.


