News August 28, 2025
భారత్‌తో వైరం.. ట్రంప్‌పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించడాన్ని అమెరికన్లు సైతం తప్పుపడుతున్నారు. తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్స్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. US-భారత్ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. అమెరికన్స్‌కు నష్టం జరుగుతోంది. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News August 28, 2025
భారీ వర్షాలు.. లేహ్‌లో చిక్కుకున్న మాధవన్

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా నటుడు మాధవన్ మరోసారి లేహ్‌లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 17 ఏళ్లనాటి ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘మేము షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. గత 4రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. 2008లో త్రీ ఇడియట్స్ షూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఇలాగే చిక్కుకున్నాం. అప్పుడు మంచు విపరీతంగా కురిసింది’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.
News August 28, 2025
వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

AP: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్షించారు. ‘అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి.. లోతట్టు, కృష్ణా పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సహాయక చర్యలకు NDRF, SDRF సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ప్రమాదకర హోర్డింగులు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలి’ అని అధికారులను ఆదేశించారు.
News August 28, 2025
SALUTE: మీరే మా సూపర్ హీరోస్!

ఆపద వేళ పోలీసులు సూపర్ హీరోలుగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సాయం కోసం ఎదురుచూస్తోన్న వేలాది మందికి చేయందిస్తున్నారు. భారీ వరదను సైతం లెక్క చేయకుండా ఇళ్లలోకి వెళ్లి వృద్ధులు, పిల్లలను ఒడ్డుకు చేరుస్తున్నారు. వీరికి ఆర్మీ జవాన్లు సైతం తోడవడంతో ప్రాణనష్టం జరగకుండా రేయింబవళ్లు అలర్ట్‌గా ఉంటున్నారు. వీరికి సెల్యూట్ చేయాల్సిందే.