News November 12, 2024
బెంగళూరులో ఇంటి అద్దెలు.. చుక్కలు చూపిస్తున్నాయి

Silicon Valley of Indiaగా పేరొందిన బెంగళూరు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నవారికి చుక్కలు చూపిస్తోంది. ఓ అపార్ట్మెంట్లో నెలకు ₹40 వేలు అద్దె ఉన్న ఇంటికి ₹5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాలని యజమాని చెప్పడంతో హర్నిద్ కౌర్ అనే యువతి నిర్ఘాంతపోయింది. దీనిపై ఆమె చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో నెట్టింట చర్చ జరుగుతోంది. అద్దెకు బదులు ఆమె ఇంటినే కొనేయడం ఉత్తమమని కొందరు సలహా ఇస్తున్నారు.
Similar News
News November 14, 2025
దుల్కర్ ‘కాంత’ మూవీ పబ్లిక్ టాక్

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీబోర్సే జంటగా నటించిన ‘కాంత’ మూవీ ప్రీమియర్లు నిన్న పడ్డాయి. సినిమా థ్రిల్‌కు గురి చేస్తుందని మూవీ చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దుల్కర్, భాగ్యశ్రీ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
News November 14, 2025
308 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 308 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. అభ్యర్థుల వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cochinshipyard.in/
News November 14, 2025
ఎలాంటి పాడి పశువులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి?

గేదె పాలుకు ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటే గేదెలతో, ఆవు పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటే సంకర జాతి ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి. పాల సేకరణ కేంద్రాలు ఉండే ప్రాంతాలలో సంకర జాతి ఆవులు లేక ముర్రా జాతి గేదెలతో ఫారాన్ని ప్రారంభించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పచ్చిమేత వనరులు, మంచి యాజమాన్యం ఉంటే హోలిస్టీన్ ఫ్రీజియన్ సంకర జాతి ఆవులతో, సాధారణమైన మేత వనరులుంటే జెర్సీ సంకర జాతి ఆవులతో ఫామ్ ప్రారంభించాలి.


