News December 8, 2024

ఇంటింటి కులగణన సర్వే పూర్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 6న చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. GHMC మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో భద్రపరుస్తున్నారు. మరో 4, 5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా కులగణన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

Similar News

News October 19, 2025

ముడతలు తొలగించే గాడ్జెట్

image

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్‌ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్‌ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.

News October 19, 2025

IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్‌ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.

News October 19, 2025

ముందు నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్‌!

image

US అధ్యక్షుడు ట్రంప్‌ పాలసీలు, నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ లక్షలాది మంది వీధుల్లోకెక్కారు. ఆ <<18047118>>నిరసనల<<>> వీడియోలు వైరల్ కాగా ట్రంప్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపాను. నా వల్లే ఇతర దేశాల్లో శాంతి నెలకొందని గొప్పలు చెప్పుకోవడం కాదు. మంచి పాలన అందించి ముందు నీ దేశాన్ని బాగుచేసుకో’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. అసలు ట్రంప్‌ను ఎందుకు ఎన్నుకున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.