News November 22, 2024
చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోము: రంగనాథ్

TG: చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని, చెరువులను కాపాడాలంటే నివాసాలను కూల్చాల్సిన పనిలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నిర్మాణాలు కూల్చి చెరువులను కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడం లక్ష్యమన్నారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని, FTL, బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని చెప్పారు. ఆక్రమణల నియంత్రణకు సాంకేతికత వాడుతున్నామన్నారు.
Similar News
News January 6, 2026
సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు!

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా 5 వేలకు పైగా బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలకు 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి మీరు పండుగకు ఊరెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా?
News January 6, 2026
వాట్సాప్లో తిరుమల సమాచారం!

AP: తిరుమల వెళ్లే భక్తులు వాట్సాప్ ద్వారా పలు సేవలు పొందొచ్చు. 9552300009 నంబరుకు వాట్సాప్లో Hi అని మెసేజ్ పంపితే పలు రకాల సమాచారాన్ని టీటీడీ అందిస్తోంది. సర్వ దర్శన స్లాట్ల స్టేటస్, ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయి?, అందుబాటులో ఉన్న శ్రీవాణి టికెట్లు, కాషన్ డిపాజిట్ రిఫండ్ ట్రాకింగ్ స్టేటస్ తదితర సేవలు అందుతాయని టీటీడీ పేర్కొంది.
News January 6, 2026
హనుమంతుడి పాదాలను తాకకూడదా?

హనుమంతుడు నిత్య బ్రహ్మచారి కావడంతో ఆయన విగ్రహాన్ని, పాదాలను మహిళలు తాకకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నియమం అమలులో ఉంది. అలాగే మహిళలు స్వామివారికి అభిషేకం చేయడం, పంచామృతాలు, వస్త్రాలు సమర్పించడం వంటివి కూడా నేరుగా చేయకూడదట. దూరం నుంచి దర్శించుకుని, భక్తితో నమస్కరించాలని సూచిస్తారు. మనసారా తలచుకుంటే ఆంజనేయుడు అందరినీ చల్లగా చూస్తాడు.


