News January 27, 2025

‘అందరికీ ఇళ్లు’.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

APలో ‘అందరికీ ఇళ్లు’ పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుండగా, స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్‌కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా, రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.