News July 16, 2024

మరో రెండు నౌకలపై హౌతీల దాడి

image

ఎర్ర సముద్రంలో రెండు వాణిజ్య నౌకలపై యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ దాడి చేశారు. గంట వ్యవధిలోనే రెండు దశల్లో మిస్సైల్స్ దాడి జరిగింది. కానీ నౌకలకు సమీపంలో ఇవి పేలాయని, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి షిప్‌లపై హౌతీలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే చాలా నౌకలు ధ్వంసమయ్యాయి. అమెరికా, బ్రిటన్ సైన్యాలు వీరిపై తిరుగుబాటుకు దిగుతున్నాయి.

Similar News

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వాట్సాప్‌లో అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్..

image

టీమ్స్, గూగుల్ మీట్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాయిస్‌తోపాటు వీడియో కాల్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కాల్ పెడుతున్న ఉద్దేశం చెప్పొచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన లింకును కాపీ చేసి పార్టిసిపెంట్స్‌కు షేర్ చేయవచ్చు. కాల్ మొదలయ్యే ముందు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ వెళుతుంది.