News August 20, 2024
దాడికి ఎలా అనుమతించారు: సుప్రీంకోర్టు

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఘోరమైన నేరం జరిగిన తరువాత ఆస్పత్రికి 24 గంటలూ భద్రత కల్పించాల్సింది పోయి, ఒక గుంపు వచ్చి దాడి చేయడానికి ఎలా అనుమతించారని బెంగాల్ ప్రభుత్వాన్ని SC ప్రశ్నించింది. రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పింది. దాడి చేసిన వారందరినీ తప్పనిసరిగా విచారించాలని ఆదేశించింది. ఆగస్టు 22లోపు నివేదిక సమర్పించాలని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ CBIని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.
News December 7, 2025
పుతిన్ వెళ్లారు.. జెలెన్స్కీ వస్తున్నారు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు. శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న PM మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య ధోరణికి బలం చేకూర్చాయి.
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


