News August 17, 2025

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

APలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే పెరిగాయి. గతవారం కిలో రూ.220-రూ.230 వరకు అమ్మకాలు జరిగాయి. ఇవాళ పల్నాడులో కిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.240-రూ.250, గుంటూరు, చిత్తూరులో రూ.200 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.190- రూ.210, వరంగల్‌లో రూ.200, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?

Similar News

News August 17, 2025

రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటారా?

image

TG: కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి కొద్ది రోజులుగా CM రేవంత్‌‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం మల్లు రవి నేతృత్వంలో జరగనున్న PCC క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే దీనిపై నిన్న మల్లు రవితో PCC చీఫ్ చర్చించారని, గజ్వేల్‌లో పార్టీ నేతల పంచాయితీపైనా మీటింగ్‌లో మాట్లాడతారని సమాచారం.

News August 17, 2025

ఉమ్మడి ADB, WGL జిల్లాలను ముంచెత్తిన వానలు

image

TG: ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ములుగు (D) గోవిందరావుపేటలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షపాతం, ఆదిలాబాద్ (D) తాంసిలో 17 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇవాళ భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, HNK, WGL జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

News August 17, 2025

సీనియర్ నటి కన్నుమూత

image

ప్రముఖ మరాఠీ నటి జ్యోతీ చందేకర్(69) అనారోగ్యంతో కన్నుమూశారు. 12ఏళ్ల వయసులోనే యాక్టింగ్ ప్రారంభించిన ఆమె సీరియళ్లు, చిత్రాల్లో నటించారు. ‘థోల్కీ’, ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. చందేకర్ కూతురు తేజస్వినీ పండిట్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘తిచా ఉంబర్తా’లో నటించడం విశేషం. జ్యోతి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.