News August 20, 2024
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.66,600కు చేరింది. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.120 తగ్గి రూ.72,650 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.1000 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రూ.92వేలుగా ఉంది.
Similar News
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.
News November 28, 2025
డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.
News November 28, 2025
వాషింగ్ మెషీన్.. ఈ జాగ్రత్తలు తెలుసా?

నిన్న HYDలో వాషింగ్ మెషీన్ <<18404735>>పేలడంతో<<>> చాలా మంది భయపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. *రెగ్యులర్‌గా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్ చేయించాలి *టూల్స్ మార్చాల్సి వస్తే బ్రాండెడ్వే వాడాలి *ఎక్కువ లోడ్ (దుస్తులు) వేయొద్దు. దీన్ని వల్ల ఒత్తిడి పెరుగుతుంది *ఏదైనా పెద్ద శబ్దం, వాసన వస్తే వెంటనే ప్లగ్ తీసి టెక్నీషియన్‌ను పిలవాలి.


