News May 14, 2024

స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రత ఎలా ఉంటుంది?

image

ఎలక్షన్ పోలింగ్ అయిపోయాక ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. ఈ గదులకు రెండు తాళాలు వేస్తారు. ఒకటి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. కౌంటింగ్ రోజునే ఈ గదులను తెరుస్తారు. ఈ రూమ్‌ల దరిదాపులకు ఎవరూ రాకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. నిరంతరం CCTV నిఘా ఉంటుంది. రిటర్నింగ్ అధికారి రోజూ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని తనిఖీ చేస్తారు.

Similar News

News March 13, 2026

ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

image

AP: ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.

News March 13, 2026

విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

image

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <>వెబ్‌సైట్‌<<>> ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 16న నోటిఫికేషన్ రానుంది. 18వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

News March 13, 2026

మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

image

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.