News November 1, 2024
ఎంత దారుణం.. అవతరణ దినం నిర్వహించరా?: రోజా
చంద్రబాబు సీఎం అవడం వల్ల APకి అవతరణ దినం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘వైసీపీ పాలనలో NOV 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం ఘనంగా నిర్వహించాం. కూటమి ప్రభుత్వం దీనిని నిర్వహించకపోవడం ఎంత దారుణం. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? భావితరాలకు ఏం చెప్తారు? 6 కోట్ల ఆంధ్రులను అవమానించినందుకు పవన్, బాబు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 26, 2024
CWC మీటింగ్లో మ్యాప్ వివాదం
బెళగావిలో CWC మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారత చిత్రపటంలో కశ్మీర్లోని కొన్ని భాగాలు లేకపోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై వివరణ ఇవ్వాలని BJP డిమాండ్ చేసింది. జార్జ్ సొరోస్తో కలసి దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని విమర్శించింది. అయితే ఆ ఫ్లెక్సీని పార్టీ కాకుండా స్థానిక శ్రేణులు ఎవరో ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.
News December 26, 2024
70 గంటలుగా బోరుబావిలో.. చిట్టి తల్లికి నరకం
రాజస్థాన్లోని కోఠ్పుత్లీ జిల్లాలో 3ఏళ్ల చిన్నారి 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 70 గంటల క్రితం ఆమె పడిపోగా అప్పటి నుంచీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలిక ప్రస్తుతం 150 అడుగుల వద్ద ఉందన్నారు. పైపుతో ఆక్సిజన్ పంపిస్తున్నామని తెలిపారు. చిట్టితల్లి క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
News December 26, 2024
ఎర్రోళ్ల శ్రీనివాస్కు బెయిల్
TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనను ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రూ.5వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.