News November 21, 2024
హోంమంత్రికే రక్షణ లేకపోతే ఎలా?: సీఎం చంద్రబాబు
AP: తల్లి, చెల్లిని SMలో అసభ్యంగా దూషించినా గత సీఎం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది? కొందరికి డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయింది. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
Similar News
News November 24, 2024
రాజ్ థాక్రేకు భంగపాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.
News November 24, 2024
111 కోట్ల జీరో టికెట్లు జారీ: మంత్రి పొన్నం
TG: తమ ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలు రూ.3,747 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఈ నెల 20 వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి చేరిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక TGSRTC ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
News November 24, 2024
IPL: మెగా వేలానికి వేళాయే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ, రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
* మొత్తం స్లాట్స్: 204 * వేలంలో పాల్గొనేవారి సంఖ్య: 577
* భారత ప్లేయర్లు: 367 మంది * విదేశీ ప్లేయర్లు: 210 మంది
* అత్యంత పెద్ద వయస్కుడు: అండర్సన్(ENG)
* పిన్న వయస్కుడు: వైభవ్ సూర్యవంశి(బిహార్)
* లైవ్: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్, IPL వెబ్సైట్