News October 4, 2024
నా అనుమతి లేకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తారు?: ఖర్గే

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో తనకు కేటాయించిన గదిలోకి అనుమతి లేకుండా CPWD, CISF, టాటా ప్రాజెక్ట్ సిబ్బంది ప్రవేశించడంపై ఖర్గే మండిపడ్డారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ‘ఇది అసాధారణ పరిణామం. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించడమే. ఎవరి ఆదేశానుసారం వారు ప్రవేశించారు?. దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి’ అని ఖర్గే పేర్కొన్నారు.
Similar News
News March 17, 2026
ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్‌రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్‌లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.
News March 17, 2026
రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
News March 17, 2026
చదువులో కాకపోయినా.. క్రికెట్‌లో 80% కొట్టేసిన సూర్యకుమార్

కెప్టెన్‌గా సూర్యకుమార్ విన్నింగ్ పర్సంటేజ్ 80% దాటింది. ‘చదువులో నాకు ఎప్పుడూ 50-60% కూడా దాటలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజీని క్రికెట్‌లో సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ఫ్యామిలీ మొదట్లో చదువుపై ఫోకస్ చేయమన్నా.. తర్వాత తన ప్యాషన్‌ను గుర్తించి సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. WC నెగ్గిన తర్వాత కూడా తన భార్య దేవిషా తనలో అహంకారం పెరగకుండా చూస్తోందన్నారు.


