News March 19, 2025
ఐపీఎల్లో రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా?: అశ్విన్

ఆటగాళ్ల ప్రదర్శనను ఆయా ఫార్మాట్ల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ అన్నారు. ‘T20ల్లో రాణిస్తే ODI/టెస్టులకు, టెస్టుల్లో రాణిస్తే T20లకు తీసుకోవాలని జనం అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. IPLలో రాణిస్తే T20Iకు మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. శ్రేయస్ గురించి మాట్లాడుతూ ‘IPLలో కెప్టెన్గా రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా దక్కుతుంది? CTలో అతను బాగా ఆడాడు. IPLలోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
PHOTOS: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

AP: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గం. వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 10రోజుల్లో దర్శనానికి మొత్తం 180 గంటల సమయం ఉంటే.. దానిలో టీటీడీ సామాన్యులకే 164 గంటలు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన తిరుమల ఆలయ ఫొటోలను పైన ఉన్న గ్యాలరీలో చూడొచ్చు.
News December 29, 2025
నవీన్ యాదవ్ ఎన్నిక రద్దు చేయాలి: హైకోర్టులో సునీత పిటిషన్

TG: జూబ్లీహిల్స్ MLAగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని BRS అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో కేసుల వివరాలు తక్కువగా చూపారని ఆరోపించారు. ప్రచారంలో కూడా రూల్స్ ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, సునీత దాఖలు చేసిన పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పెండింగ్లో ఉంది.
News December 29, 2025
సీరియల్ నటి నందిని ఆత్మహత్య

ప్రముఖ కన్నడ-తమిళ్ సీరియల్ నటి నందిని(26) సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్లో పాపులర్ అయిన ‘గౌరీ’ సీరియల్లో దుర్గ, కనకగా ఆమె డబుల్ రోల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నందిని పెళ్లి విషయంలో పేరెంట్స్ ఒత్తిడి చేయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


