News October 16, 2024
ఇలా చేస్తూ ఉద్యోగాలు రావట్లేదంటే ఎలా?

దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన చెందుతున్న వేళ ఉద్యోగార్థులు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో ఓ కంపెనీ సీఈవో చెప్పుకొచ్చారు. Entourage కంపెనీ CEO అనన్య నారంగ్ తనకు వచ్చిన జాబ్ అప్లికేషన్‌ను Xలో పంచుకున్నారు. ఈ జాబ్‌కు తనకు అన్ని అర్హతలున్నాయని పేర్కొంటూ అనుభవాలు, తన స్కిల్స్‌ను చెప్పకుండా ఖాళీగా ఉంచేశారు. గూగుల్ నుంచి కాపీ చేసి అలానే పంపించేశారని, సొంతంగా ఆలోచించట్లేదని ఆమె మండిపడ్డారు.
Similar News
News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
News December 2, 2025
PCOS ఉంటే వీటికి దూరంగా ఉండాలి

PCOS ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. వంటల్లో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల PCOS, ఇన్సులిన్ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీంతో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
News December 2, 2025
ఇవాళ ఢిల్లీకి రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రంలో ఈ నెల 8, 9న జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్రమంత్రులు, AICC నేతలను ఆయన ఇన్వైట్ చేయనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మంలోని కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో CM పాల్గొంటారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.


