News September 20, 2024
ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు?: షర్మిల

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
Similar News
News December 14, 2025
సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.
News December 14, 2025
సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. తీరా రిజల్ట్ చూస్తే..

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మం. పీపడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన.. ప్రచారానికి డబ్బులు లేకపోవడం, పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటంతో అయ్యప్ప మాలలో ఉండగానే ఉరేసుకున్నాడు. అయితే ఇవాళ్టి ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.
News December 14, 2025
ఏపీలో ₹లక్ష కోట్లతో ‘సాగర్మాల’ ప్రాజెక్టులు

AP: ‘సాగర్మాల’ కింద APలో ₹లక్ష కోట్లతో 110 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక వృద్ధికి వీలుగా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో పేర్కొంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆధునీకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంపు, కోస్టల్ కమ్యూనిటీ, షిప్పింగ్, జలమార్గాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో తీరప్రాంతం లాజిస్టిక్ హబ్గా మారుతుందని పేర్కొంది.


