News March 4, 2025
చికెన్ 65కు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

చికెన్ 65 రెసిపీకి చాలా క్రేజ్ ఉంది. కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని అందరికీ డౌట్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంఎం బుహారి అనే చెఫ్ చెన్నైలో ఓ రెస్టారెంట్ స్థాపించారు. అందులో బ్రిటీష్ వారికి సరికొత్త మాంసాహారం అందించేవారు. ఓ సైనికుడు భాష సమస్య కారణంగా మెనూ కార్డులో 65వ నంబర్లో ఉండే చికెన్ వంటకం తెమ్మనేవాడు. మిగతా కస్టమర్లు కూడా అలానే చెప్పేవారు. అది కాస్త చికెన్ 65గా స్థిరపడింది.
Similar News
News December 18, 2025
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.
News December 18, 2025
అసభ్యంగా నివేద ఫొటోలు.. స్పందించిన హీరోయిన్

AI జనరేటెడ్ ఫొటోల <<18592227>>బెడద<<>> హీరోయిన్లను పట్టి పీడిస్తోంది. తాజాగా నివేదా థామస్ ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది తన గోప్యతపై దాడి అంటూ ట్వీట్ చేశారు. వీటిని పోస్ట్ చేసినవారు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఇటీవల పలువురు హీరోయిన్ల ఫొటోలూ ఇలాగే వైరల్ అయ్యాయి.
News December 18, 2025
నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం!

TG: మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇప్పటికే ముగిసింది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాగా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవని <<18592868>>అనర్హత<<>> పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే.


