News April 7, 2025
ఆదాయం లేకుండా GDP ఎలా పెరిగింది బాబూ: బొత్స

AP: అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని సీఎం చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు ఆదాయమే లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుందని నిలదీశారు. ‘కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ధైర్యం ఆయనకు లేదు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో ఉన్న చెత్త తీయించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News April 8, 2025
పరామర్శకు వచ్చి జేజేలా?.. జగన్పై సునీత ఫైర్

AP: పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా మాజీ CM జగన్కు తెలియదని TDP MLA పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జై జగన్ అంటూ పరామర్శకు వెళ్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి? జగన్ ఒక MLA మాత్రమే. ఒక DSP, 10 మంది పోలీసులు ఆయన పర్యటనకు సరిపోతారు. వైసీపీ నేత లింగమయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.
News April 8, 2025
ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్: మంత్రి

TG: ప్రజలకు వేగవంతంగా సేవలను అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 10-15minలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా 22 కార్యాలయాల్లో ఈనెల 10 నుంచి స్లాట్ బుకింగ్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. registration.telangana.gov.in సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.
News April 8, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74227 వద్ద, నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో 22535 వద్ద ముగిశాయి. టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు రాణించాయి. అటు క్రూడాయిల్ రేట్లు తగ్గడం కూడా ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.