News April 14, 2024
ఇండియాకు +91 కోడ్ ఎలా వచ్చిందంటే..

భారత్‌లోని ఫోన్ నెంబర్లకు అంతర్జాతీయ కాల్స్ చేయాలంటే నెంబర్‌కు ముందు +91 కలపాల్సి ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలుసా? దేశాలకు ఈ కోడ్‌లను ఐక్యరాజ్యసమితి కేటాయించింది. అందుకోసం వివిధ ప్రాంతాలను 9 జోన్లుగా విభజించింది. వీటిలో 9వ జోన్‌లో ఆసియా, గల్ఫ్ దేశాలున్నాయి. ఈక్రమంలోనే భారత్‌కు +91, పాక్‌కు +92, అఫ్గాన్‌కు +93 వరుసలో కోడ్‌లను కేటాయించింది.
Similar News
News March 14, 2026
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో ప్రజల ఆందోళనలు తొలగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, పలు రెవెన్యూ అంశాలపై తహశీల్దార్లతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించారు.
News March 14, 2026
కమల్ హాసన్‌పై చిన్మయి తీవ్ర విమర్శలు

తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి మండిపడ్డారు. ‘ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఆయన అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. కాగా గతంలో వైరముత్తు తనను వేధించాడని చిన్మయి తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు.
News March 14, 2026
విద్యుత్ వినియోగంలో ALL TIME RECORD

TG: రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఈ నెల 13న అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేశాయి. అలాగే ఉ.11.17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ఠ లోడ్‌ను విజయవంతంగా తట్టుకున్నాయి. తెలంగాణ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు. గతేడాది మార్చి 18న 335.19MU విద్యుత్ వాడకం, మార్చి 20న 17,162MW గరిష్ఠ డిమాండ్ నమోదైంది. రోజుకు 350+ MU సరఫరా, 19,000MW గరిష్ఠ లోడ్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


