News December 2, 2024

5వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో భారత్ ఎలా గెలిచింది?

image

AUS PM XIతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 5 వికెట్ల తేడా కదా? అనే సందేహం చాలామందికి వచ్చింది. అయితే 46ఓవర్ల మ్యాచ్‌లో మొదట PM XI 43.2 ఓవర్లలో 240/10 స్కోర్ చేసింది. భారత్ 42.5 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచాక కూడా 46ఓవర్లు పూర్తిగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించాక మరో వికెట్ కోల్పోయింది.

Similar News

News December 26, 2024

సినీ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ

image

TG: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశముంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 26, 2024

హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున

image

TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.

News December 26, 2024

సినీ పెద్దలకు సీఎం రేవంత్ షాక్

image

TG: మూవీ ఇండస్ట్రీకి కీలకమైన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సినీ ప్రముఖులకు నిరాశే ఎదురైంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. CM నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు నిరాశ చెందినట్లు సమాచారం. రూ.వందల కోట్లతో తెరకెక్కిన సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడం పెద్ద దెబ్బేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.