News August 31, 2024
అవనిని మనూ భాకర్ ఎలా ప్రశంసించారంటే..

పారాలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన అవనీ లేఖరను మనూ భాకర్ ప్రశంసించారు. ఆమె ప్రయాణం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ‘షూటింగ్లో ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఇతర పారాలింపియన్స్ సైతం ఎంతో ప్రేరణనిస్తారు. వాళ్లు సవాళ్లను అధిగమించి దేశానికి పతకాలు తెస్తున్నారు. మనమంతా వాళ్ల నుంచి నేర్చుకోవాలి. వాళ్లను చూసి గర్విస్తున్నాను. అవనికి శుభాకాంక్షలు’ అని తెలిపారు. టోక్యోలోనూ అవని 2 పతకాలు గెలవడం విశేషం.
Similar News
News November 23, 2025
పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్‌లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.
News November 23, 2025
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
News November 23, 2025
వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను మళ్లీ చూస్తామా?

SAతో వన్డే సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ గిల్‌కు గాయం కాగా, వైస్ కెప్టెన్ అయ్యర్ కూడా అందుబాటులో లేరని సమాచారం. దీంతో రోహిత్ శర్మను మళ్లీ వన్డే కెప్టెన్‌గా తీసుకురావాలా అనే చర్చ మొదలైంది. అయితే ఈ ప్రతిపాదనను రోహిత్ తిరస్కరించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టం చేశారు. KL రాహుల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది.


