News April 24, 2024
హైకోర్టు తీర్పు ముందుగానే బీజేపీకి ఎలా తెలిసింది?: మమతా బెనర్జీ

బెంగాల్లో 23వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన <<13101174>>తీర్పు<<>> పొలిటికల్ టర్న్ తీసుకుంది. ‘సోమవారం పెద్ద ఘటన జరగనుంది’ అని BJP నేత సువేందు అధికారి 2 రోజుల ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో ముందే ఎలా తెలుసు? ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే సువేందు చెప్పిన విస్ఫోటనమా?’ అని CM మమత ప్రశ్నించారు.
Similar News
News January 27, 2026
సరికొత్తగా ఆధార్ యాప్.. సేవలు సులభతరం

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ యాప్‌లో అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని UIDAI కల్పించింది. రేపటి నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకింగ్ సేవల కోసం ఆధార్-మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి. అలాగే ట్రావెలింగ్‌లో ఐడెంటిటీ చెకింగ్స్ వేగంగా పూర్తయ్యేలా ఆధార్ యాప్ కొత్త వెర్షన్ రేపే అందుబాటులోకి రానుంది. దీంతో ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం ఉండదు.
News January 27, 2026
సూపర్ పోలీస్‌కి రైల్వే అత్యున్నత పురస్కారం

150 మందికిపైగా పిల్లలను రక్షించిన RPF ఇన్స్పెక్టర్ చందనా సిన్హా తాజాగా భారత రైల్వే అత్యున్నత అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చందన 2010లో RPFలో చేరారు. 2024లో భారత రైల్వే ఆపరేషన్ లిటిల్ ఏంజిల్స్‌లో భాగమయ్యారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తప్పిపోయిన, అక్రమ రవాణాకు సంబంధించి 152మంది, బచ్పన్ బచావో సమితితో కలిసి మరో 41మంది పిల్లలను రక్షించారు.
News January 27, 2026
ఇద్దరు దిగ్గజాలు తీసుకున్న గొప్ప నిర్ణయం.. భారత్‌తో డీల్‌పై EU చీఫ్

India-EU ట్రేడ్ డీల్‌ను ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్న సమయంలో ఒప్పందం జరిగిందని, ‘ఇద్దరు దిగ్గజాలు’ తీసుకొన్న గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. యూరప్ టెక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు.. ఇండియా స్కిల్స్, సర్వీసెస్ తోడైతే ఇరుపక్షాలకూ లాభమన్నారు. ట్రంప్ టారిఫ్ విధానాలకు ఈ డీల్ గట్టి సందేశమని EC ప్రెసిడెంట్ కోస్టా పేర్కొన్నారు.


