News November 19, 2024
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందంటే?
ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా 1996లో భారత పర్యటనకు వచ్చింది. అప్పుడే క్రికెట్కు విశేష సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ గౌరవార్థం ఓ సిరీస్ నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వెంటనే ఈ సిరీస్కు ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’గా నామకరణం చేశాయి. అలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య మొత్తం 16 సిరీస్లు జరగ్గా టీమ్ఇండియా 10సార్లు నెగ్గింది.
Similar News
News November 19, 2024
దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి
TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.
News November 19, 2024
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్
AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News November 19, 2024
కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.