News October 12, 2025

అర్ధరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది: మమత

image

MBBS స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనపై బెంగాల్ CM మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి అర్ధరాత్రి 12.30గం.కు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మణిపుర్, బిహార్, UP, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

Similar News

News October 12, 2025

ఏడు వారాల నగలను ఎందుకు ధరించేవారు?

image

పూర్వం అలంకరణ కోసమే కాక ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్య సంపద కోసం స్త్రీలు ఆభరణాలు ధరించేవారు. నేటి రత్నపు ఉంగరాల మాదిరిగానే, ఒకప్పుడు గ్రహాలను శాంతింపజేయడానికి రోజుకో రకమైన ఆభరణాలను ధరించేవారు. వీటినే ఏడువారాల నగలు అంటారు. ఆయా వారాలకు ఆధిపత్యం వహించే గ్రహాలకి ఆయా రోజుల్లో ప్రీతికరమైన నగలు ధరిస్తే.. సానుకూల శక్తి లభిస్తుందని భావిస్తారు. బంగారం రోజూ శరీర భాగాలను తాకడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.

News October 12, 2025

ఏడు వారాల నగలు ఇవే..

image

ఆదివారము – సూర్యుని కోసం కెంపుల కమ్మలు, హారాలు
సోమవారము – చంద్రుని కోసం ముత్యాల హారాలు, ముత్యాల గాజులు
మంగళవారము – కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధవారము – బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు
గురువారము – బృహస్పతి కోసం పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు
శుక్రవారము – శుక్రుని కోసం వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక
శనివారము – శని కోసం నీలమణి హారాలు

News October 12, 2025

తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి

image

AP: రాష్ట్రంలో పలు చోట్ల విషాద ఘటనలు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా చీరాల(M) వాడరేవు సముద్ర తీరంలో స్నానం చేస్తూ అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. అటు కడప(D) కమలాపురంలో ఈతకు వెళ్లి ఈర్ల సుకన్య(11) అనే బాలిక చనిపోగా, అన్నమయ్య(D) మదనపల్లెలో సాయికృష్ణ(15) అనే విద్యార్థి హంద్రీనీవా కాలువలో గల్లంతయ్యాడు.