News September 24, 2024
బేడీలతో ఉన్న నిందితుడు తుపాకీ ఎలా కాల్చాడు?: ‘మహా’ విపక్షాలు

బద్లాపూర్ లైంగిక దాడి కేసులో నిందితుడి ఎన్కౌంటర్ ఘటనపై మహారాష్ట్ర విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. BJP నేతకు చెందిన స్కూల్లో ఈ లైంగిక దాడి జరగడంతో ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయంటున్నాయి. చేతులకు బేడీలతో ఉన్న నిందితుడు తుపాకీ ఎలా కాల్చగలిగాడని EX హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రశ్నించారు. ఇది చట్టం, న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమే అని MP సుప్రియా సూలే విమర్శించారు.
Similar News
News November 15, 2025
ఈ ఆయుర్వేద ఉత్పత్తులతో లివర్‌కు ప్రమాదం: డా.ఫిలిప్స్

అధిక ఆర్సెనిక్, పాదరసం ఉన్న ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగంతో కాలేయానికి నష్టమని డాక్టర్ అబీ ఫిలిప్స్ రాసిన ఆర్టికల్‌ను మెక్‌గిల్ విశ్వవిద్యాలయం(కెనడా) ప్రచురించింది. ఈ లోహాల విషప్రభావం కాలేయాన్ని దెబ్బతీయడంతో పాటు ఆరోగ్య సమస్యలు తెస్తుందని ఆయన తెలిపారు. ఈ ఉత్పత్తులపై నాణ్యత, నియంత్రణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News November 15, 2025
మోడల్ సిటీగా శ్రీసిటీ విస్తరణ: CBN

AP: మరో 50 కంపెనీల ఏర్పాటుకు వీలుగా 6వేల ఎకరాలతో శ్రీసిటీని విస్తరిస్తామని CBN తెలిపారు. 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, UK, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. CII సదస్సులో 5 యూనిట్లను వర్చువల్‌గా CM ప్రారంభించారు.
News November 15, 2025
ముగిసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్

సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 189/9 పరుగులకు పరిమితమైంది. గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. KL రాహుల్(39), సుందర్(29) పంత్(27), జడేజా(27) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. SA బౌలర్లలో సిమోన్ 4, జాన్సెన్ 3 వికెట్లు, మహరాజ్, బోష్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.


