News August 15, 2024

వినేశ్ బరువు 49.9 నుంచి 52.7 KGకి ఎలా పెరిగిందంటే..

image

వినేశ్ 100gr అధిక బరువుతో డిస్‌క్వాలిఫై కావడం తెలిసిందే. సెమీస్ తర్వాత ఆమె 49.9-52.7 కిలోలకు పెరిగారు. ఉదయం 300gr జ్యూస్, బౌట్స్‌కు ముందు తర్వాత తీసుకున్న ఫ్లూయిడ్స్‌తో 2KG, మధ్యాహ్నం స్నాక్స్‌తో మరో 700gr పెరిగారు. ఫైనల్‌కు ముందు రాత్రి ఎన్ని కసరత్తులు చేసినా 50KG లోపు తగ్గలేదు. బట్టలు, జుట్టు కత్తిరించినా వృథానే అయింది. నిజానికి ఆమె సాధారణ బరువు 57KG. ఈ స్థాయి నుంచి తగ్గుతూ వస్తోంది.

Similar News

News February 2, 2026

నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు ఏం చేశారంటే?

image

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.

News February 2, 2026

సరస్వతీ దేవి వీణాగానం కన్నా తీయనైంది..

image

లలితా దేవి కొలువులో సరస్వతీ దేవి తన వీణతో అమృతతుల్యమైన సంగీతాన్ని వినిపించగా, ముక్కోటి దేవతలు పరవశించిపోయారు. ఆ గానాన్ని మెచ్చిన లలితాంబిక ‘బాగుంది’ అని పలికింది. ఆ ఒక్క మాటలోని మాధుర్యం, తన వీణా స్వరాల కంటే మిన్నగా ఉందని గ్రహించిన సరస్వతి దేవి వినమ్రంగా తన వీణను పక్కన పెట్టేసింది. సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతి వీణ నాదాన్ని సైతం మించిపోయేంత కమ్మని కంఠస్వరం లలితా దేవిది.

News February 2, 2026

లోకేశ్ నన్ను హతమర్చాలని చూస్తున్నారు: జోగి

image

AP: రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అన్నారు. లోకేశ్ ఆదేశంతో MP చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు. దాడికి ముందు TDP నేతలతో DCP, CI చర్చించారు. TDP గూండాలు ర్యాలీగా పెట్రోలు సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్‌గా వచ్చారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడక మానరు’ అని హెచ్చరించారు.