News June 5, 2024

జైలులో ఉన్న అభ్యర్థులు ఎలా ప్రమాణం చేస్తారు?

image

జైలులో ఉన్న అమృత్ పాల్, షేక్ అబ్దుల్ రషీద్ నిన్న వెలువడిన ఫలితాల్లో ఎంపీలుగా గెలుపొందారు. అయితే, వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు పార్లమెంట్‌కు రావాల్సి ఉంటుంది. దీనికోసం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. వీరిని ప్రత్యేక భద్రత నడుమ పార్లమెంట్‌కు తీసుకెళ్లి ప్రమాణస్వీకారం కాగానే తిరిగి జైలుకి తీసుకొస్తారు. దోషులుగా తేలి, రెండేళ్లు జైలులో ఉంటే వీరిపై అనర్హత వేటు పడుతుంది.

Similar News

News September 18, 2025

అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

News September 18, 2025

రాష్ట్రంలో 21 పోస్టులు

image

<>ఏపీపీఎస్సీ<<>> 21 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో డ్రాట్స్‌మెన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్(లైబ్రరీ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.370. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 18, 2025

బాల్మర్ లారీలో ఉద్యోగాలు

image

<>బాల్మర్ లారీ<<>> 38 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.